
యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం “రంగ్ దే”.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ‘బతుకు బస్టాండ్’ సాంగ్ ను విడుదల చేశారు.
నితిన్, కీర్తి సురేష్‌లపై అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ లో నితిన్ తన గోడు వెలిబుచ్చుతున్నాడు.
ఈ పాటను సాగర్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుంచి విడుదలైన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తోంది.
మీరు కూడా ‘బతుకు బస్టాండ్’ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.