పీవీకి కాంగ్రెస్ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు

232
Congress did not give minimum respect PV: Harish Rao

తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్క సారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.

ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం కూడా ఇవ్వలేదని హరీశ్ రావు అన్నారు.

ఆయనకు సమాధిని కూడా కట్టలేదని విమర్శించారు. పీవీ కుమార్తెను తాము ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించగానే ఆ రెండు పార్టీల్లో కలవరం మొదలైందని అన్నారు.

తమకు ఓటు వేయాలని కాంగ్రెస్, బీజేపీలు అడుగుతున్నాయని, వారికి ఓటు ఎందుకు వేయాలని హరీశ్ రావు ప్రశ్నించారు.

ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.