వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రాందేవ్ బాబా కీల‌క సూచ‌న

246
Ramdev Baba's keynote agricultural laws

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

హ‌ర్యానాలో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రైన బాబా రాందేవ్ రైతులు ఆందోళ‌న‌ల‌పై ఓ కీల‌క సూచ‌న చేశారు.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లును మూడేళ్ల‌పాటు నిలిపేయాల‌ని ఆయ‌న కేంద్రానికి సూచించారు.

దీంతో రైతులు ఆందోళ‌న విర‌మిస్తార‌ని రాందేవ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

రైతుల‌కు, కేంద్రానికి మ‌ధ్య శాంతి నెల‌కొనాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మూడేళ్ల పాటు కేంద్రం చ‌ట్టాల అమ‌లును వాయిదా వేయాల‌ని చెప్పారు. ఇటు రైతులు కూడా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆయ‌న సూచించారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ చ‌ట్టాల అమ‌లును ఏడాదిన్న‌ర పాటు నిలిపేశాయ‌ని తెలిపారు.

ఈ స‌మ‌యం చాల‌ద‌ని రైతులు భావిస్తే కేంద్రం దానిని మూడేళ్ల‌కు పొడిగించాల‌ని ఆయన సూచించారు.