“గాలి సంపత్” ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

590
Gaali Sampath Trailer launched by Ace Director SS Rajamouli

రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ “గాలి సంపత్”. అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పిస్తున్నారు.

సినిమాలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మీమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు.

అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా… సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి “గాలి సంపత్” ట్రైలర్ ను విడుదల చేశారు.

“పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి..

నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది” అంటూ హీరో శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ 2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేయబడింది.

“ప్రతి అమ్మాయికీ డ‌బ్బున్నోడే కావాలి.. లేక‌పోతే ఫారినోడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు” అంటూ హీరోయిన్‌తో శ్రీ విష్ణు చెప్పడం ఆకట్టుకుంటోంది.

మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.