కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న “ఉప్పెన” టీం

245
Uppena Team Visits Tirumala Temple

బుచ్చిబాబు సానా దర్శకుడిగా పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన చిత్రం “ఉప్పెన”.

ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఉప్పెన మూవీ ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. ‘ఉప్పెన’కు ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు.

ప్రస్తుతం ‘ఉప్పెన’ టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి.

ఈ సందర్భంగా “ఉప్పెన” టీమ్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు అంతా కలిసి శనివారం తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కాలినడకన కొండెక్కడం విశేషం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందాము. ఆ ఆశీస్సులతో ఉప్పెన సినిమా విజ‌యం సాధించింది. తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందా. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తా” అని తెలిపారు.