ఆకట్టుకుంటున్న “షాదీ ముబారక్” ట్రైలర్

306
Shaadi Mubarak Trailer Out Now

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “షాదీ ముబారక్”. ‌

ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. “షాదీ ముబారక్”’ మార్చి 5న విడుద‌లవుతుంది.

ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై హైప్ పెంచేసింది. .

కాగా హీరోయిన్ త‌ను పెళ్లి చేసుకునే అబ్బాయే కాదు, త‌న ఇంటిపేరు కూడా అందంగా ఉండాల‌ని అనుకుంటుంది.

అలాంటి అమ్మాయికి సున్నిపెంట అనే ఇంటి పేరు ఉండే హీరోతో పెళ్ళి అంటే ఎలా ఉంటుంది ? అనేదే సినిమా కథాంశం.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కామెడి, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను ట్రైలర్ వేరే స్థాయికి తీసుకెళ్లాయి.

మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.