
కన్నడ స్టార్ హీరో “కేజీఎఫ్” చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్” చిత్రం 2018, డిసెంబర్ 21న విడుదలైంది.
ప్రపంచ వ్యాప్తంగా కెజియఫ్ 240 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది.
దీంతో ఒక్కసారిగా యష్, ప్రశాంత్ నీల్ వైపు సినిమా ప్రపంచం కళ్ళు పడ్డాయి. రాఖీ భాయ్‌కు అంతా సలాం కొట్టారు.
బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
కేజీఎఫ్ సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే చిత్రాన్ని చేసిన యష్ ఈ మూవీని జూలై 16న విడుదల చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
“కేజీఎఫ్”తో యష్ అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర కాగా… ప్రస్తుతం ఆయన గతంలో నటించిన సినిమాలను డబ్ చేసి టాలీవుడ్ లో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో యష్, అమూల్య, సాధు కోకిల ప్రధాన పాత్రలలో ఎస్ కృష్ణ తెరకెక్కించిన “గజకేసరి” చిత్రాన్ని మార్చి 5న ఇక్కడ విడుదల చేయనున్నారు.
2014 మే 23న ఈ కన్నడ చిత్రం శాండల్‌వుడ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మొట్ట మొదటగా తెలుగులో అనువాదం అవుతున్న యష్ చిత్రం ఇదే కావడం విశేషం.
శ్రీ వేదాక్షర మూవీస్, కలర్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో యశ్ రెండు పాత్రల్లో కనిపించటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం వి. హరికృష్ణ అందించారు.
తాజాగా “గజకేసరి” చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.