ఆకట్టుకుంటున్న “తెల్లవారితే గురువారం” టీజర్

244
Thellavarithe Guruvaram Teaser Released

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి “మ‌త్తు వ‌ద‌ల‌రా” అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది.

తాజాగా శ్రీసింహా కోడూరి నటిస్తున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మణికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

శుక్రవారం ‘తెల్లవారితే గురువారం’ మూవీ టీజర్ విడుదల చేశారు.

ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఇంట్లో నుండి పారిపోయిన హీరో… అతని లవ్, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే ఈ సినిమా కథ అని టీజర్ చూస్తుంటే అర్థమా అవుతోంది.

ఇక సింహా తన నటన, డైలాగ్ లతో ఆకట్టుకున్నాడు. విజువల్స్, ఆర్ఆర్ కూడా చక్కగా కుదిరాయి. ఈ సినిమాకి సంగీతం కాల భైరవ అందిస్తున్నాడు.

మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.