యువకుని మృతి కేసులో కోడి అరెస్ట్

223
Man Dead case Cock arrested

కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆలోచనలేకుండా పోలీసులు కోడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి,  కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు.

ఈ ఘటన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్ లో మూడు రోజుల క్రితం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే పందెం కోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని సతీశ్ అనే యువకుడు మృతి చెందాడు.

కోడిని పందెంలోకి దింపే సమయంలో ఈ ఘటన జరిగింది. కత్తి కట్టిన కాలుని కాకుండా మరోకాలుని సతీశ్ పట్టుకున్నాడు.

అయితే కోడి తప్పించుకునే ప్రయత్నం చేయగా, దానికి కట్టిన కత్తి సతీశ్ పొట్టలో గుచ్చుకుంది.

తీవ్రంగా గాయపడ్డ సతీశ్ ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సతీశ్ మరణానికి కారణమైన కోడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

లాకప్ లో దాన్ని కట్టేశారు. కేసులో ఏ1గా కోడిని చేర్చారు.మరోవైపు ఆ కోడిని పోలీసులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

ఇక స్వేచ్ఛను కోల్పోయిన కోడిపుంజు.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తిస్తోంది.