“శ్రీకారం” టైటిల్ సాంగ్ వచ్చేసింది

290
Sreekaram Title Tracks Lyrical Video

కిశోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “శ్రీకారం”. శర్వానంద్ యువ రైతు పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల అయింది. “కనివిని ఎరుగని కథ ఇక మొదలైంది. అడుగులో అడుగుగా.. వెతికిన వెలుగుల అలికిడి ఎదురైంది” అంటూ సాగుతున్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

రామజోగయ్య శాస్త్రి మనసుకి హత్తుకునే లిరిక్స్ అందించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రావు రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, సప్తగిరి కీలక పాత్రలు చేస్తున్నారు.

రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.