“ఉప్పెన” మేకింగ్ వీడియో

383
Uppena’s Beats a 21 year old Indian record

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకుడిగా పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన చిత్రం “ఉప్పెన”.

ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఉప్పెన మూవీ ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. ‘ఉప్పెన’కు ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు.

ప్రస్తుతం 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే దిశగా పరుగులు పెడుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.

బేబమ్మగా కృతి శెట్టి, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్‌, కృతి తండ్రి రాయణం పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన తీరు ఈ వీడియోలో చూడొచ్చు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సందడి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

కాగా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అందరూ బాగా కనెక్ట్ అయ్యారు.

దేవీ శ్రీ ప్రసాద్ పాటలు సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఉప్పెన’ టాపిక్కే నడుస్తోంది.