
వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుల్ ఓపెన్ చేస్తే చాలు అనేక వార్తలు ఏవేవో పోస్ట్‌లు దర్శనమిస్తాయి.
ముఖ్యంగా వాట్సాప్‌కు కుప్పలు తెప్పలుగా సందేశాలు, వార్తలు వస్తుంటాయి.
ఇందులో ఏవి నిజమైనవి, ఏవి ఫేక్ న్యూస్ అని గుర్తించలేక తికమక పడుతున్నారు.
కొంత మంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ కూడా చేస్తుంటారు.
దీని వల్ల మనం ఫార్వర్డ్ చేసింది ఫేక్ న్యూస్ అయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వాట్సాప్‌లో వచ్చే న్యూస్ కానీ, మెసేజ్‌లు కానీ నిజమా అబద్దమా అని తెలుసుకోవడమెలా?
మీ వాట్సాప్‌కు టెక్ట్స్ రూపంలో ఏదైనా మెసేజ్ వస్తే అది ఫార్వర్డ్ చేసిందో కాదో ఎడమ వైపున చూపిస్తుంది. బాణం గుర్తులు ఎక్కువగా ఉంటే ఆ వార్త ఎక్కువసార్లు ఫార్వర్డ్ అయినట్లు భావించాలి.
ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫార్వర్డ్ అయిన టెక్ట్స్ మెసేజ్‌లకు ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. ఎలా అంటే ఆ మెసేజ్‌కు కుడివైపున మాగ్నిఫైయింగ్ గ్లాస్ గుర్తు కనిపిస్తుంది.
అంటే సెర్చ్ గుర్తులాంటిదన్నమాట. ఈ మాగ్నిఫైయింగ్ గ్లాస్ గుర్తును రెండుసార్లు క్లిక్ చేస్తే సెర్చ్ వెబ్ ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే ఆ మెసేజ్ లేదా వార్తకు సంబంధించిన గూగుల్ సెర్చ్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
దీంతో ఆ మెసేజ్ లేదా వార్త నిజమా అబద్దమా అనేది తేలిపోతుంది. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే ఉంది.
త్వరలో మన దేశంలో కూడా అందుబాటులోకి రానుంది. అంతేకాదు ఇది ప్రస్తుతం టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఫొటోలు, వీడియోలకు దీనిని ఉపయోగించలేం.