సమ్మర్‌లో కూల్ కూల్ ఆఫర్స్

619

భ‌గ భ‌గ మండే సూర్య ప్ర‌తాపం మొద‌లైంది. అలాగ‌ని ప్ర‌తి రోజూ శీత‌ల‌పానీయాలు బ‌య‌ట తాగాలంటే బ‌డ్జెట్ స‌రిపోదు.

అయినా తాగుదామ‌నుకుంటే ఎన్ని తాగినా దాహం తీర‌డం లేదు.

ఇటువంటి ప‌రిస్థితుల్లో ఇంట్లో ఫ్రిజ్ ఉంటే నిమ్మ‌ర‌సం, ర‌స్నా లాంటి పానీయాలు చేసుకుని ఎంచ‌క్కా ఇంటిల్లిపాది సేద‌దీరొచ్చు.

ఈ ఆలోచ‌న‌తోనే ఫ్లిప్‌కార్ట్ అనే సంస్థ కూలింగ్ డేస్ ప్రకటించింది.

వేసవిలో రిఫ్రిజిరేటర్, ఏసీ, ఫ్యాన్స్ కొనేవారికి బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ఇచ్చింది.

సాంసంగ్, బ్లూస్టార్, హిటాచీ, ఎల్‌జీ, వోల్టాస్ లాంటి బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ లభిస్తాయి.

ఏసీ కొనాలనుకునే వారికి వ‌ర్ల్‌పూల్, మార్క్యూ, ఒనిడా లాంటి బ్రాండ్స్ నుంచి ప్రత్యేక డీల్స్ ఉన్నాయి.

ఏసీ, ఇన్వర్టర్ ఏసీ, త్రీ స్టార్ ఏసీ, విండో ఏసీ లాంటి వేర్వేరు వ‌స్తువుల‌పై కూడా ఆఫర్స్ ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

6 నెలల నుంచి 24 నెలల నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో ఈ ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఏసీ కొనాలనుకునేవారికి 0.8 నుంచి 1.5 టన్స్ వరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి.

3 స్టార్ నుంచి 5 స్టార్ వరకు ఎనర్జీ ఎఫీషియెంట్ మోడల్స్ లభిస్తాయి. ఫ్యాన్స్ విభాగంలో సీలింగ్, వాల్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్‌ల‌కూ ఆఫర్స్ వ‌ర్తిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్‌లో మార్క్యూ ఇన్వర్టర్ ఏసీ ప్రారంభ ధర రూ.18,999. విండోస్ ఏసీ ప్రారంభ ధర రూ.16,499.

త్రీ స్టార్ ఏసీ ధర రూ.17,999. ఎయిర్ కూలర్స్ ప్రారంభ ధర రూ.5,999. చిన్నసైజ్ కూలర్స్ రూ.2,499 నుంచి ప్రారంభమవుతుంది.

ఇక రూ.2,299 విలువైన Candes సీలింగ్ ఫ్యాన్‌ను రూ.1,221 ధరకే కొనొచ్చు.

1.5టన్ కెపాసిటీ గల సాంసంగ్ ఏసీ అసలు ధర రూ.45,999 కాగా ఆఫర్‌లో రూ.30,999కే సొంత‌మ‌వుతుంది.

ఇక క్రాంప్టన్ 88 లీటర్ ఎయిర్‌కూలర్ అసలు ధర రూ.19,900 కాగా ఆఫర్ ధర రూ.9,995.

హేయర్ 565 లీటర్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.1,15,000. ఆఫర్‌లో రూ.56,767 ధరకే కొనొచ్చు.

ఇలా ఏసీ, రిఫ్రిజిరేటర్, కూలర్స్‌పై 65 శాతం వరకు ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ప్రకటించింది. ఈ సేల్ మార్చి 14న ముగుస్తుంది.