టిక్‌టాక్ బ్యాన్ కావడంతో యువత డల్‌గా మారిపోయింది. అయితే ఫేస్‌బుక్ తన సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
దీంతో యువతలో మళ్లీ జోరందుకుంది. షార్ట్ వీడియోలు చేస్తూ తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
అయితే ఈ ఇన్‌స్టా రీల్స్ ఫీచర్చ్‌ను ఫేస్‌బుక్‌లోనూ ప్రారంభించనున్నారు. దీంతో మళ్లీ షార్ట్ వీడియోలను ఎంచక్కా తీసుకోవచ్చు.
భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను వాడేందుకు అనుమతి లభించింది.
దీంతో టిక్‌టాక్ మాదిరిగానే ఫాస్ట్ వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకోవచ్చు.
ఇండియాలోని కంటెంట్ క్రియేటర్ల కోసం ఫేస్‌బుక్ ఈ షార్ట్ వీడియోల ఫీచర్‌ను యాడ్ చేసింది.
ఫేస్‌బుక్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికమండ్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫేస్‌బుక్ రీల్స్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
ప్రతిఒక్కరికి త్వరలో అందుబాటులోకి రానుంది. క్రియేట్ ఆప్షన్‌పై ఒకసారి క్లిక్ చేస్తే 10 సెకన్ల నుంచి 15 సెకన్ల వరకు షార్ట్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.
అందులో మ్యూజిక్, ఫిల్టర్లు, మరెన్నో ఎడిట్స్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఫీచర్‌లోనూ ఫేస్‌బుక్ రికమండ్ రీల్స్ ఆప్షన్ ఉంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ కూడా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.