
ప్రపంచ సెల్‌ఫోన్లలో అత్యుత్తమమైంది యాపిల్ సెల్‌ఫోన్.
ఈ ప్రపంచ దిగ్గజ సంస్థ సరికొత్త 13వ సిరీస్ ఫీచర్లపై వినియోగదారులను ఊరిస్తూ వస్తోంది.
ఎట్టకేలకు బుధవారం ఆ ఫీచర్లు ఏంటో తెలిసిపోయింది.
అంతేకాదు ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ డేట్ ధర ఎంతో కూడా లీక్ అయ్యాయి.
ఫ్లాగ్ షిప్ ఐఫోన్లను అధికారికంగా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు అమెరికా టెక్ దిగ్గజం ప్లాన్ చేస్తోంది.
ఇంతలోనే ఐఫోన్ 13 సిరీస్ సిరీస్ లీక్ అయింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో యాపిల్ సంస్థ ఐఫోన్ మోడళ్లను రిలీజ్ చేయడంలో ఆలస్యమైంది.
ఈ ఏడాదిలో కొత్త ఫ్లాగ్ షిప్ ఐఫోన్లను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో లాంచ్ చేయనుంది.
ఈలోపే ఐపోన్ 13 సిరీస్ మోడల్ ఫీచర్లు లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఐఫోన్ SE (2021) లేదా iPhone SE 3 మోడల్ కూడా రిలీజ్ కానుంది.
ఐఫోన్ 12S మోడల్ కూడా రిలీజ్ కాబోతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కానీ దీనిపై ఇప్పటి వరకూ ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ నుంచి మూడు కొత్త మోడళ్లు రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
ఐఫోన్ 13, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 13 మోడల్, మిగతా రెండు మోడళ్ల కంటే చాలా చీపెస్ట్ మోడల్ అని అంటున్నారు.
ఐఫోన్ 13 సిరీస్ మూడు మోడల్ ఫోన్లలో ఏయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయో చూద్దాం.
ఒక్కో మోడల్ ధర ఎంత అనేది ఇప్పటికే డేటా లీక్ అయినట్టు తెలుస్తోంది.
అయితే ఐఫోన్ 13 సిరీస్ మోడల్ అధికారిక లాంచ్ డేట్ ఇప్పటివరకూ కంపెనీ వెల్లడించలేదు.
వస్తున్న పుకార్ల ప్రకారం ఆపిల్ సంస్థ కొత్త సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
గత ఏడాదిలో ఐఫోన్ 12 సిరీస్ లాంచింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది.
యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫీచర్లు:
ఐఫోన్ 13 మోడల్ స్ర్కీన్ 12 సిరీస్ కంటే కొంచెం పెద్ద ఉంటుందంట. 6.2 అంగుళాల రెటినా డిస్ ప్లే ఉందంట. స్లిమ్మర్ బెజిల్స్, ఫ్లాట్ డిస్ ప్లే.
- గత జనరేషన్ ఐఫోన్ మోడళ్ల కంటే నాచ్ చాలా చిన్నదిగా ఉండొచ్చు. అలాగే ఐఫోన్ 13 సిరీస్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో రాబోతుంది.
- ఐఫోన్ 13 మినీ 5.4 అంగుళాలు స్ర్కీన్
- ఐఫోన్ 13 సిరీస్ 6.1 అంగుళాల స్ర్కీన్
- ఐఫోన్ 13 ప్రో 6.1 అంగుళాల స్ర్కీన్
- ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల స్ర్కీన్
- ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఫేస్ ఐడీ ఆప్షన్
ప్రాసెసర్ : A15 బయోనిక్ చిప్ సెట్ పవర్ ఫుల్ సెటప్
- క్వాల్ కామ్ ఎక్స్ 60 5G మోడమ్
కెమెరా : ఐపోన్ 13 సిరీస్ లో పెయిర్ కెమెరాలు బెటర్ ఆప్షన్, అల్ట్రా వైడ్, టెలిఫొటో కెమెరాలు, వైడర్ /1.8 అప్రెచర్
సాఫ్ట్ వేర్ : లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్
5G : కొత్త ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 13 సిరీస్ 5G సపోర్టుతో వస్తోంది.
స్టోరేజీ : ఐఫోన్ 13 సిరీస్ 64GB, 128GB, 512GB రేంజ్ నుంచి ఉండొచ్చు. 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీ
5G సపోర్టుతో ఐఫోన్ 13 సిరీస్ మోడల్ రాబోతోంది.
ప్రస్తుతం ఐఫోన్ 12 ప్రారంభ ధర మార్కెట్లో రూ.69,900 ఉండగా.. ఐఫోన్ 13 సిరీస్ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా.
- ఐఫోన్ 13 సిరీస్‌లో మొదటి బేసిక్ మోడల్ చీపెస్ట్ ధరతో రానుంది.
- ఐఫోన్ 13 ప్రో, ప్రో మ్యాక్స్ సిరీస్ మోడల్ ధర ఎక్కువగా ఉండే అవకాశముంది.
- 699 డాలర్లు, 799 డాలర్లు, 999 డాలర్లు, 1,099 డాలర్లు ఉండొచ్చని అంచనా.