గత కొన్ని రోజులుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి.
తాజాగా బుధవారం (3-3-2021) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 356 ఖాళీలున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీలో ఈ ఖాళీలున్నాయి.
ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఏడాది కాలం అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
విద్యార్హతలు: ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ పాస్ కావాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్ పోస్టుకు ఫుల్ టైమ్ డిగ్రీ పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు 12వ తరగతితోపాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి. ట్రేడ్ అప్రెంటీస్ రీటైల్ సేల్స్ అసోసియేట్ పోస్టుకు 12వ తరగతితోపాటు రీటైల్ ట్రైనీ అసోసియేట్‌లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: 346
మహారాష్ట్ర: 187
గుజరాత్: 72
చత్తీస్‌గఢ్: 9
దాద్రా నగర్ అండ్ హవేలీ: 4
గోవా: 7
గుజరాత్: 24
మహారాష్ట్ర: 18
మధ్యప్రదేశ్: 25
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం: 2021 ఫిబ్రవరి 5
దరఖాస్తుకు చివరి తేదీ: 2021 మార్చి 7
రాతపరీక్ష: 2021 మార్చి 21
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన: 2021 మార్చి 25
వయస్సు: 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష