నిరుద్యోగులకు శుభావార్త‌

308

నిరుద్యోగుల‌కు నిజంగా ఇది శుభవార్త‌. క‌రోనా కొట్టిన దెబ్బ‌కు వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్ర‌యులైనారు.

ఇటువంటి ప‌రిస్థితుల్లో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక శుభావార్త చెబుతూ ఉద్యోగాల నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

ఈ సంస్థ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ఆ సంస్థ నుంచి మరో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది.

2018, 2019, 2020 సంవ‌త్స‌రాల‌లో GATE స్కోర్ సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు అప్లై చేయొచ్చు.

ఈ నోటిఫికేషన్ గతేడాదే విడుదలైన‌ప్ప‌టికీ కరోనా కార‌ణంగా వాయిదా పడింది. ఎంపికైన అభ్యర్థులు ఎగ్జిక్యూటీవ్ ట్రైనీలుగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. త‌ర్వాత వారు లెవల్ 10 పే స్కేల్‌కు అర్హత పొందుతారు.

ఆ సమయంలో వారికి నెలకు రూ. 56,100 వేతనం చెల్లిస్తారు. 2018, 2019 మరియు 2020 సంవత్సరాల్లో వ్యాలిడ్ గేట్ స్కోర్లు ఉండి ఇంజనీరింగ్‌ విభాగాల్లో కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు చూస్తే.. మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో 85 ఖాళీలు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 20, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో 40,

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 8, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 7,

సివిల్ ఇంజనీరింగ్ లో 35, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ, సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో 5 ఖాళీలు ఉన్నాయి.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను ఏప్రిల్ 12 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు రూ. 500 వరకు అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కొందరికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. మిగ‌తా వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.