హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాల‌కు దర‌ఖాస్తుల ఆహ్వానం

315

ఎండ‌లు ముదురుతున్న వేళ నిరుద్యోగుల‌కు ఇది చ‌ల్ల‌ని వార్త‌. హెటిరో డ్రగ్స్ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నంల‌లో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ అవకాశాన్ని వినియోగించాలని యువతను కోరింది. మార్చి 3వ తేదీన విజయనగరం జిల్లాలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది.

ఉదయం 9 గంటలకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మొదలవుతుంది. దానికి ముందే అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఖాళీలు ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి.

అయితే ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. కాకపోతే ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ ను సంద‌ర్శించండి.

ముఖ్య వివరాలు:

విద్యార్హతలు: బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ చదివినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.

ఇంటర్వ్యూలు జరిగే వేదిక: ప్రగతి డిగ్రీ కాలేజ్, కొత్తవలస, కుమ్మరివీధి, కే.కోటపాడు రోడ్, కొత్తవలస గ్రామం, మండలం, విజయనగరం జిల్లా.

జీతం: ఎంపికైన వారికి రూ.10,000 నుంచి రూ.16,000 మధ్య వేతనం ఉంటుంది.

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌:https://www.apssdc.in/ స‌ంద‌ర్శించండి.