రేపు హైదరాబాద్‌లో జాబ్‌ ఇంటర్వ్యూలు

344

క‌రోనా వ‌ల్ల అనేక మంది రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా యువ‌త ఉద్యోగాలు లేక చెడు అల‌వాట్ల‌కు బానిస‌ల‌వుతున్నారు.

ఇటువంటి ప‌రిస్థితుల్లో ప్రైవేటు సంస్థ‌లు నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌ను ప్ర‌క‌టించాయి.

ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ జయశ్రీ వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా ఐటీఐ శాంతి నగర్‌ క్యాంపస్‌, మల్లేపల్లి వియనగర్‌ కాలనీలోని జిల్లా ఉపాధి శాఖ (ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌) కార్యాలయాల్లో మార్చి 4వ తేదీన ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

పదో తరగతి నుంచి ఎంబీఏ వరకు విద్యార్హతలు గల వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.

పూర్తి వివరాలు తెలుసుకోవడానికి జిలా ఉపాధి శాఖ కార్యాలయం (ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌) లో సంప్రదించాలని ఆమె సూచించారు.

మ‌రోవైపు స్టాఫ్‌‌నర్స్‌ పోస్టు‌లకు ఎంపి‌కైన అభ్య‌ర్థులు ఈ నెల 6, 7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చు‌కో‌వా‌లని టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ సూచిం‌చింది.

గతంలో ఇచ్చిన వెబ్‌ ఆప్ష‌న్లల్లో చాలా మంది పొర‌పాట్లు చేయ‌డంతో మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించి‌నట్టు అధికారులు పేర్కొ‌న్నారు.

ఆప్షన్లు ఇచ్చే క్రమంలో జోన్‌, డిపా‌ర్ట్‌‌మెం‌ట్‌ను స్పష్టంగా పేర్కొ‌నా‌లని సూచించారు.

ఇది గతంలో ఇచ్చిన వెబ్‌ ఆప్ష‌న్లను ఎడిట్‌ చేసు‌కునే అవ‌కాశం మాత్ర‌మే‌నని, ఇప్పుడు సమ‌ర్పించే వెబ్‌‌ఆ‌ప్ష‌న్లను మార్చే అవ‌కాశం ఉండ‌దని స్పష్టం చే‌శారు.