
తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల రోజువిడిచి రోజు విధులకు హాజరవుతున్న విషయం తెలిసిందే.
ఇకపై ఆ విధులను ప్రభుత్వం రద్దుచేసింది. బుధవారం నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్లందరు రోజూ బడికి రావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.
గత ఏడాది ఆగస్టు నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు రోజువిడిచి రోజు చొప్పున హాజరవుతున్నారు.
టీచర్ల హాజరు బాధ్యతలను ఆర్జేడీలు, డీఈవోలకు అప్పగించారు. వీరితో 6, 7 తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనున్నది.
ప్రత్యక్ష తరగతులు సాగుతున్న పాఠశాలల్లో అవసరాలను బట్టి ప్రైమరీ స్కూల్ టీచర్లను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ వినియోగించుకోవాలని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.