ముల్లంగి ఓ దివ్వ ఔష‌ధం

315

చ‌క్కెర వ్యాధి. ఇంగ్లీష్‌లో దీన్ని డ‌యాబిటీస్ (షుగ‌ర్ వ్యాధి) అని కూడా అంటాం. ఒక‌ప్పుడు ఈ వ్యాధి వ‌య‌సు పైబ‌డిన వంద మందిలో ఏ ఒకరిద్ద‌రికి మాత్ర‌మే వ‌చ్చేది.

కానీ ఇప్పుడు చిన్న పిల్ల‌ల‌కు కూడా ఈ వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వాళ్లు నిర్ధారించిన ఆహారం మాత్ర‌మే తీసుకోవాలి.

మందులు కూడా వాడుతూనే ఉండాలి. ముల్లంగిని చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇది షుగ‌ర్ పేషంట్స్‌కు దివ్య ఔష‌ధ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

ముల్లంగిని ములి అని కూడా అంటారు. సాధారణంగా మనకి సీజన్‌కి దొరికే కూరగాయలు, పండ్లు వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని తెలుసు.

వీటి వల్ల ఇమ్యూనిటీ సిస్టం మెరుగ‌వ‌డ‌మే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది.

కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది.ముల్లంగిని ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుత‌మైన ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రీష‌న్స్ చెబుతున్నారు.

దగ్గు, జలుబుతో బాధ పడుతున్నా లేక వీటి వల్ల మీరు రాత్రి పూట సరిగా నిద్ర పోలేక పోతున్నా? తప్పకుండా ముల్లంగిని ఆహారంలో తీసుకోవాలి.

ఎందుకంటే ముల్లంగిలో యాంటి హైపర్టెన్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది బ్లడ్ ప్రెజర్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి దివ్యౌషధం అనే చెప్పొచ్చు.

ముల్లంగిలో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, బి6 , పొటాషియం ఇతర మినరల్స్ ఉంటాయి. దీనితో ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.

దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్ట్స్ చెబుతున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు:

ముల్లంగి వల్ల చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి లభిస్తాయి. దీనితో ఇది చాలా రకాల సమస్యలను తరిమి కొడుతుంది.

ముఖ్యంగా రక్తపోటు మరియు లివర్‌కి అనేక ప్రయోజనాల‌ను ఇస్తుంది. ముల్లంగిలో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది.

కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇదే మంచి ఆహారం. అంతేకాదు ముల్లంగిలో పోలిక్ యాసిడ్, విటమిన్-సి, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.

దీంతో ఇది బ్లడ్ ప్రెషర్‌ని త‌గ్గిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ముల్లంగి ద్వారా మనకి కలుగుతాయి. ముల్లంగిని మ‌న‌కు నచ్చిన విధంగా వండుకుని తినొచ్చు.

దీని వల్ల ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. పైగా ముల్లంగిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు త‌లెత్త‌వు. ఇది మార్కెట్‌లో నిత్యం అందుబాటులో ఉంటుంది.

కాబట్టి వీలైనప్పుడు కొనుగోలు చేసి తినొచ్చు. మామూలుగా సీజ‌న్ మారిన‌పుడ‌ల్లా మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌స్తుంటాయి.

పైగా మందులు వేసుకున్నా ఒక్కొక్కసారి రుగ్మ‌త‌లు పోవు. అటువంట‌ప్పుడు ముల్లంగిని మ‌న ఆహారంలో తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.