వేసవిలో ఇవి తీసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

287
Take these in the summer .. Stay healthy!

భానుడి ఉగ్రరూపానికి రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పగటిపూట బయటకు వెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు జంకుతున్నారు.

ఈ నేపథ్యంలో శరీరం నుంచి నీరు ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వెళ్లకుండా చూసుకోవాల‌ని డాక్టర్లు చెబుతున్నారు.

ఎండలు ముదురు తున్నాయి కదా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతుంటారు. అందుకోసం సింపుల్ గా కొన్ని  చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

ఎండవేడిని తగ్గించేందుకు కొబ్బరి నీళ్ళు, పళ్ళరసాలు, మంచినీళ్ళు, మజ్జిగ, తాటిముంజెల నీరు తీసుకుంటే మంచిది.

అలాగే బార్లీ నీళ్ళల్లో పంచదార లేదా నిమ్మరసం వేసుకొని తాగితే శరీరంలోని వేడి క్రమంగా తగ్గిపోతోంది.

వేసవిలో పుచ్చకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి తగినంత నీరు అందుతుంది. అంతేకాకుండా ప‌లు పోషకాలు కూడా అందుతాయి.

శక్తిని కోల్పోకుండా ఉండేందుకు పుచ్చకాయల్లో ఎల‌క్ట్రోలైట్లు, సుక్రోజ్‌, ఫక్టోజ్‌, గ్లూకోజ్‌లు అందుతాయి. దీంతో నీర‌సం అల‌స‌ట రాకుండా ఉంటాయి.