
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
ఆయా పార్టీలు అభ్యర్థులకు టికెట్లు ఖారారు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎంజీఆర్ పోటీ చేసి గెలిచిన స్థానం నుంచే త్వరలో జరగనున్న
అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
1967 నుంచి 76 వరకు ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించిన అళందూరు నుంచి కమల్ పోటీ చేసేందుకు నిశ్చయించుకున్నారని ఎంఎన్ఎం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంజీఆర్ నియోజకవర్గం కావడంతో పాటు 2019లో నిర్వహించిన లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పార్టీకి 10 శాతం ఓట్లు రావడం వంటి కారణాలతో అళందూరునే కమల్ ఎంచుకున్నట్టు సమాచారం.
మరోవైపు బుధవారం రాత్రి 8 గంటలకు మైలాపూర్ లో కమల్ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మార్చి 7న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.