
దేశంలో అత్యధికంగా వాహనాలను విక్రయిస్తున్న సంస్థల్లో బజాజ్ ఒకటి. ఈ సంస్థ తమ హై సేల్స్ బ్రాండ్ ప్లాటినాలో కొత్త వేరియంట్ ను చౌక ధరలో విడుదల చేసింది.
102 సీసీ ‘ప్లాటినా 100 ఈఎస్’ను బీఎస్ 6 వేరియంట్ లో, ఎలక్ట్రిక్ స్టార్ట్ తో రూ. 53,920కి అందిస్తామని ప్రకటించింది.
దేశంలో లభించే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్లలో అతి తక్కువ ధరకు లభించేది తమ బైకేనని సంస్థ పేర్కొంది.
సుదీర్ఘ ప్రయాణాలను ఇది సౌకర్యవంతం చేస్తుందని, స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతని వెల్లడించింది.
ఈ సెగ్మెంట్ లో 70 లక్షల బైక్ లను ఇప్పటికే తాము విక్రయించామని తెలిపింది.
బజాజ్ మార్కెటింగ్ హెడ్ సుందరరామన్ ఈ బైక్ గురించి వివరైంచారు. ఈ వాహనం కూడా కస్టమర్ల ఆదరణను చూరగొంటుందన్న అభిప్రాయాన్నిఆయన వ్యక్తం చేశారు.
ఇదే బైక్ వేరియంట్ కిక్ స్టార్ట్ మోడల్ గా రూ. 51,667 ధరలో న్యూఢిల్లీలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.