హ్యాపీగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

395

సూర్య‌డు భ‌గ భ‌గ మండిపోతున్నాడు. గొంతులో త‌డారిపోతోంది. ఏదైనా చ‌ల్ల‌గా తాగితే బాగుండు అనిపిస్తోంది.

అవునండి వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్న‌ట్టుగా ఉంది ఎండ‌.

వీపు సుర్రుమంటుండ‌టంతో జ‌నాలు విల‌విల్లాడిపోతున్నారు. ఆహారం తీసుకోవ‌డం కంటే చ‌ల్ల‌గా ఏదైనా తాగాల‌నిపిస్తోంది.

ఎంత తాగినా దాహం తీర‌డం లేదు. ఈ ఎండ‌ల‌కు కూల‌ర్లు, ఏసీలు తెగ తిర‌గేస్తున్నాయి.

బ‌య‌టికి వ‌స్తే ఎండ తీవ్ర‌త. తీర‌ని దాహం. దాహార్తిని తీర్చుకోవడానికి కొందరు కూల్ వాటర్ తాగుతుంటే, మరికొందరు చల్లని పానియాలవైపు చూస్తున్నారు.

చాలామంది దాహార్తిని తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. మిగ‌తా వాటి గురించేమో కానీ కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కూల్ డ్రింక్స్ తాగితే దాహం తీరడం మాటేమో కానీ, కొత్తగా అనేక అనారోగ్య సమస్యలు రావడం ఖాయం అంటున్నారు.

ఎందుకంటే, కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువ శాతంలో ఉంటుంది. అది శరీరంలో కొవ్వును పెంచుతుంది.

దీంతో బరువు పెరుగుతారు. ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

కావాలంటే కొబ్బరిబోండాలు, పుచ్చకాయ, నిమ్మ, చెరుకు రసం వంటి పానియాలు తాగడం ఉత్తమం అని డాక్టర్లు సూచిస్తున్నారు.