దాడి చేసిన వారిని కేసీఆర్ సంకలో పెట్టుకున్నాడు: బండి సంజయ్

226
KU OU destroyed by KCR: Bandi Sanjay

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

ఉద్యమకారులపై దాడి చేసిన వారిని కేసీఆర్ సంకలో పెట్టుకున్నాడని ఆయన మండిపడ్డారు.

సూర్యాపేట సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేంధర్ రెడ్డి ఎన్నికల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అన్ని వర్గాల ప్రజల ఉద్యమాలు,1200 మంది అమరుల ఆత్మత్యాగాలతోనే తెలంగాణా వచ్చిందన్నారు.

కేసీఆర్ రాక్షస పాలన నుండి తెలంగాణా విముక్తి కోసం మరో ఉద్యమాన్ని బీజేపీ చేస్తుందన్నారు.

కార్పొరేట్ విద్యా సంస్థల్లో దొంగ ఓట్లను చేర్పించి వారి డబ్బులతో ఓట్లను కొనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

కోదండరాం పోటీ చేస్తే ఆకాంక్షలు నెరవేరవు, ఓట్లు చీలిపోతాయని కోరామన్నారు.

భైంసాలో హిందువుల మీద దాడి చేస్తే టీఆర్ఎస్ నేతలకు పట్టడంలేదని సంజయ్ విమర్శించారు.