మనం నిత్యం వండుకునే ప్రతి కూరలోనూ ఉల్లిగడ్డను వాడుతూ ఉంటాం. శాఖాహార, మాసంహార కూరల్లోని ఉల్లిపాయలను వేస్తుంటాం.
చాలామంది ఉల్లిగడ్డలను కోసేటప్పుడు కంట్లో నీళ్లు తెచ్చుకొంటూ ఇబ్బందులు పడుతుంటారు.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉల్లిగడ్డలను కోసేటప్పుడు కళ్లల్లో నీళ్లు రాకుండా తప్పించుకోవచ్చు.
సాధారణంగా ఉల్లి పాయలను కోసినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల కళ్లు మండటమే కాకుండా నీరు కూడా వస్తుంది.
ఉల్లిగడ్డలను గాలి, వెలుతురు ఎక్కువ ఉండే చోట కట్ చేయడం మంచిది. కిటికీ దగ్గర ఉల్లిపాయలను కోయడం ద్వారా కళ్లు ఎక్కువగా మండకుండా ఉంటాయి.
ఉల్లిగడ్డలను కోసినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ అనే రసాయనం ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఆ రసాయన వాయువులు మన కంటికి చేరినప్పుడు కళ్లు మండుతాయి.
అందుకే ఉల్లిగడ్డలను కట్ చేసేముందు 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా ఉల్లిగడ్డను కోసేప్పుడు విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్ రసాయనం గడ్డకడుతుంది. తద్వారా మన కళ్లు మండటం కూడా తగ్గుతుంది.
ఉల్లిగడ్డలను పదును లేని చాకుతో కట్ చేస్తే వాటి పొరలలో నుంచి ఎక్కువ మోతాదులో సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అదే పలుచగా, పదునుగా ఉండే కత్తిని వాడినప్పుడు ఉల్లి పొర తొందరగా కట్ అయి తక్కువ మోతాదులో రసాయనాలు వెలువడతాయి. కళ్లు కూడా అంతగా మండవు.
మంటకు దగ్గరగా ఉండి ఉల్లిగడ్డలను కట్ చేయడం వల్ల కూడా కళ్లలో నుంచి నీరు రావు.
అందుకే వంట స్టవ్ దగ్గర ఉండి ఉల్లిగడ్డలను కట్ చేయాలి. పై జాగ్రత్తలు పాటిస్తే ఉల్లిపాయలు కోసేటప్పుడు కంట్లో నుంచి నీరు రాకుండా ఉంటుంది.