ధ‌ర త‌క్కువ.. మైలేజ్ ఎక్కువ‌

262

చ‌మురు ధ‌ర‌లు రోజు రోజుకు పెరుగుతున్న స‌మ‌యంలో పెట్రోల్‌, డీజిల్‌ల‌ను పొదుపుగా వాడుకోవాలి. అవ‌స‌ర‌మైతేనే త‌ప్ప వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీయ‌డం లేదు.

కానీ మోటార్ సైకిళ్ల అమ్మ‌కాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. అయితే ఈ మోటార్ సైకిల్‌పై కుటుంబమంతా క‌లిసి సుదీర్ఘ ప్ర‌యాణాలు చేయ‌లేవు.

ఇటువంటి ప‌రిస్థితుల్లో త‌క్క‌వ ధ‌ర‌కు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహ‌నాల కోసం జ‌నాలు ఎదురు చూస్తున్నారు.

కారు హోదాను కూడా ఇవ్వ‌డంతో పాటు ఇంటిల్లిపాది ప్ర‌యాణించొచ్చు.

దీంతో త‌క్కువ ధ‌ర‌కు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మారుతీ సుజుకీ డిజైర్: గ‌తేడాది స‌రికొత్త డిజైన్ మార్కెట్‌లోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఈ కారుకు డిమాండ్ పెరిగింది.

ఇది లీట‌రుకు 24.12 కిలోమీట‌ర్ల మైలేజిని ఇస్తుంది. ఇది 1.2-లీటర్ డ్యూయల్ జెట్ యూనిట్ ఇంజన్‌తో త‌యారైంది.

అంతేకాకుండా 88 హార్స్ పవర్ హెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ 1.2-లీటర్ మోటార్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

ఎక్స్ షోరూంలో దీని ధర రూ.7.41 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్: ఈ మోడల్ కారు రెండో స్థానంలో ఉంది. సెడాన్‌తో పోలిస్తే స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ కొంచెం లైట్‌గా ఉంటుంది.

మైలేజి విషయంలో మాత్రం వెనుకంజలో ఉంది. డిజైర్ మాదిరే అదే ఇంజన్‌ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ లీటరుకు 23.76 కిలోమీటర్ల వరకు మైలేజి ఇస్తుంది.

ఎక్స్ షోరూంలో దీని ధర రూ.6.86 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

డాట్సన్ రెడీ-గో: మైలేజి అధికంగా ఇచ్చే కార్ల జాబితాలో డాట్సన్ రెడీ-గో కూడా ఉంది.

ఇది లీటరుకు 22 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది.

అంతేకాకుండా 1.0-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

ఈ కారు ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.4.92 లక్షలు.

రెనాల్ట్ క్విడ్: బీఎస్4 ఇంజన్‌ను కలిగిన‌ రెనాల్ట్ క్విడ్ అత్యధికంగా మైలేజినిచ్చే కారుగా గుర్తింపు పొందింది.

అయితే బీఎస్6కు మారిన తర్వాత మైలేజి కాస్త తగ్గింది. 800సీసీ 1.0-లీటర్ గ్యాస్ ఇంజిన్‌ను కలిగిన ఈ వాహనం లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల మైలేజినిస్తుంది.

అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 4.72 లక్షలు.

మారుతీ సుజుకీ వాగన్-ఆర్: ఈ కారు రెండు ఇంజన్‌ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది చిన్న ఇంజిన్ అయిన‌ప్ప‌టికీ మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంది.

ఇది 1.0-లీటర్ 67 హార్స్ పవర్ హెచ్ పీ, 90 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 21.79 కిలోమీటర్ల మైలేజినిస్తుంది.

అంతేకాకుండా ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.5.48 లక్షలు

మారుతీ ఎస్-ప్రెసో: ఈ సరికొత్త మోడల్ 1.0-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంది. వాగన్ ఆర్ మోడల్ ఇంజన్‌నే ఇందులోనూ వినియోగించారు.

ఇది లీటరుకు గరిష్ఠంగా 21.7 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

ఎక్స్ షోరూంలో దీని ధర రూ.4.82 లక్షలు.

మారుతీ సుజుకీ సెలేరియో: అత్యుత్తమ మైలేజినిచ్చే పెట్రోల్ కార్లలో సెలేరియో మోడల్ ముందు వరుసలో ఉంది.

ఎస్-ప్రెస్, వాగన్-ఆర్ మోడళ్లలో ఉన్న ఇంజిన్‌నే ఇందులోనూ ఉపయోగించారు.

పవర్ ఔట్ పుట్ కూడా ఆ కార్లలో మాదిరిగానే ఉంది.

ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇది లీటరుకు గరిష్ఠంగా 21.63 కిలోమీటర్ల మైలేజినిస్తుంది.

ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.5.42 లక్షలు.