లాక్‌డౌన్ తర్వాత ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రజా రవాణ అందుబాటులోకి రాకపోవడం ఒక కారణం.
దీంతో ఉద్యోగాలకు, సొంత పనులపై బయటికి వెళ్లాలనుకునే వారు వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో టూ వీలర్ మార్కెట్‌కు కొత్త ఉత్పాహం వచ్చింది.
మరోవైపు బీఎస్ 6 నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలు మంచి టెక్నాలజీతో తయారవుతున్నాయి. దీంతో ఇంధనం ఆదా అవ్వటంతోపాటు మైలేజ్ బ్రహ్మాండంగా ఇచ్చే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి.
పెట్రోలు ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఇలాంటి వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తున్నాయి.
టూ వీలర్ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఈఎంఐ సదుపాయాలు కల్పిస్తున్నాయి. దీంతో స్కూటర్లకు గిరాకీ పెరుగుతోంది. బీఎస్ 6 శ్రేణిలో కూడా చాలా వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి.
కానీ వాటిల్లో ఏది ఉత్తమమైందిని ఆలోచిస్తున్నారు. ఈ జామితాలో .జపాన్ కంపెనీ మోడల్స్ ముందంజలో ఉన్నాయి.
Yamaha Ray ZR 125
ఫ్యూయల్ ఎఫిషియంట్ మోడల్‌గా Yamaha Ray ZR 125కు మంచి పేరుంది.
యమహా ZR ఇంజిన్‌తో పనిచేసే యమహా రే స్కూటర్ ఏకంగా లీటకె్ఎ 66.23 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది 125CC ఇంజిన్ కావటం హైలైట్.
గతంలో ఇది కేవలం 110సీసీ మాత్రమే. పైగా చాలా లైట్ వెయిట్ ఉన్న బండి. కేవలం 99 కేజీల బరువుతూగే ఈ టూ వీలర్ ఈజీ టు రైడ్ మోడల్స్‌లో ఒకటిగా ఉంది.
Yamaha Fascino 125
దీని బరువు కూడా 99 కేజీలే. Yamaha Fascino 125 మాత్రం లీటరు పెట్రోల్ 65.92 కిలోమీటర్లు ఇస్తుంది.
కానీ ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో లేవు. అయినా Yamaha Fascino 125పై రైడ్ చాలా బాగుంటుంది.
Suzuki Burgman Street
Suzuki Burgman Street ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ డిజైన్ సెగ్మెంట్‌లోకి వస్తుంది. ఇది లీటర్లు పెట్రోల్ 55.88 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది.
మంచి సత్తా ఉన్న బండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 125సీసీ వాహనాల్లో ఇది కూడా బెస్ట్ ఆప్షన్‌గా ఉంది.
Honda Activa 125
మనదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న బంట్లలో Honda Activa 125కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 125సీసీ ట్రిమ్‌ని ఇంట్రడ్యూస్ చేసిన హోండా బీఎస్ 6 వర్షన్ కోసం కొత్త ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదలైంది.
హోండా యాక్టివా మనదేశంలో తొలి బీఎస్6 స్కూటర్. ఇది లీటరు పెట్రోల్ 52.63 కిలోమీటర్లు ఇస్తుంది.
Suzuki Access 125
ఈ బండి లీటరు పెట్రోల్ 52.45 కిలొమీటర్లు ఇస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, కలర్డ్ సీటింగ్, క్రోమ్ బీజెల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ బీఎస్ 6 నిబంధనలతో ఆకర్శణీయంగా ఉంది.
మిగతా టూ వీలర్స్‌తో పోల్చుకుంటే ఇది కూడా మంచి క్యాచీ లుక్, ఫీచర్లతో ఉంటుంది.