
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు.
నేరుగా ఆలాయనికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా అధికారుల పనులపై దిశా నిర్దేశం చేశారు.లక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయం పునః ప్రారంభం ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు.
ఈ మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించేందుకు యాద్రాద్రిలో పర్యటిస్తున్నారు.
రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు 2016, అక్టోబర్‌లో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు రూ.850 కోట్లు వెచ్చించినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు.
4.33 ఎకరాల్లో గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు వంటి అనేక విశిష్టతలతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం కేసీఆర్ అక్కడి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు పూర్తయిన పనుల గురించి కేసీఆర్‌కు సంబంధిత అధికారులు వివరిస్తున్నారు.
మాఢ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపాన్ని, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లను పరిశీలించారు.