
ఏపీలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలోని తన నియోజక వరాగంలో ఈ రోజు ఉదయం ఆయన మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
కొందరు వైసీపీ నేతలు తనను విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు అధికారంలో ఉన్న ఈ రెండేళ్లలో ఏయే అభివృద్ధి పనులు చేశారన్న విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాగే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.