ప్యాంట్ షర్ట్ వేసుకున్న ఏనుగు

214

మామూలుగా పెంపుడు జంతువులైన కుక్క‌ల‌కు బ‌ట్ట‌లు కుట్టించి వేస్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో కోతులను పెంచుకుంటున్నారు.

వాటికి కూడా డ్రెస్ కుట్టించి వేస్తున్నారు. అవి చిన్న జంతువులు కాబ‌ట్టి వాటి కొల‌తలు తీసుకోవ‌డం కుట్ట‌డం సుల‌భ‌మే.

కానీ భారీ ఏనుగుకు ప్యాంట్ ష‌ర్ట్ కుట్టాలంటే. అమ్మ బాబోయ్ అనుకుంటాం క‌దా. కానీ ఓ ఏనుగు ప‌ర్సుల్ క‌ల‌ర్ ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుని తోక ఊపుకుంటూ వీధుల్లో దర్జాగా తిరుగుతోంది.

అదేంటీ ఏనుగు ప్యాంటు, షర్టూ వేసుకోవటమేంటి? అన్న సందేహం మీకు క‌లిగింది క‌దా. కానీ ఇది నిజం.

దానికి ఎంత క్లాత్ పడుతుంది? ఓ తాను క్లాత్ సరిపోతుందా? అనే పిచ్చి డౌట్లు వ‌స్తున్నాయా? మీ అనుమానాల‌ను కాసేపు ప‌క్క‌న పెట్ట‌మ‌ని చె్ప్పాను క‌దా.

అసలు విషయానికి వద్దాం..ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

ఎన్నో టాలెంటెడ్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్యాంటు, షర్టూ వేసుకున్న ఏనుగు ఫోటోను ఆనంద్ మహేంద్రా షేర్ చేశారు.

ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అంతకంటే ఫన్నీ కామెంట్ పెడుతున్నారు? ఆ షర్ట్, ప్యాంట్ వేసిన ఏనుగు కంఫర్ట్‌గా ఉందా? అంటూ జోకులేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆనంద్ మహేంద్రా తన దృష్టికి వచ్చిన ఇంట్రెస్టిక్ విషయాలను షేర్ చేస్తుంటారు దేశ సమకాలీన పరిస్థితుల నుంచి ఫన్నీ విషయాలపై కూడా ఆయన భిన్న రీతిలో స్పందిస్తారు.

ప్యాంట్ ష‌ర్ట్ ధ‌రించిన ఏనుగు ఫొటోను మహీంద్రా షేర్ చేస్తూ ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా. ఎలీ-ప్యాంట్‌’ క్యాప్షన్ పెట్టారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటోలో ఏనుగు పర్పుల్‌ కలర్‌ షర్ట్‌, వైట్‌ కలర్ ప్యాంట్‌తో పాటు బ్లాక్‌ బెల్టు కూడా పెట్టుకుని ఉంది.

అలా చక్కగా ముస్తాబైన ఆ ఏనుగు మావటి వెనకాలే చాలా బుద్దిగా నడుస్తూ వెళ్తోంది. ఈ ఫొటో ఎక్కడిది? అని మాత్రం అడ‌గ‌కండి.

ఫన్నీగా ఉంది ఉంది కాబట్టి మనసారా ఆస్వాదించిండి. ప్రస్తుతం ప్యాంటు, షర్టూ వేసుకున్న ఏనుగు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే వేలాది లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు సరదా కామెంట్లు, ఫన్నీ మీమ్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు.

ఏనుగుకు ప్యాంట్ మావటికి లుంగీ అంటూ ఒక యూజర్‌ కామెంట్‌ చేశారు.

ఏనుగు చినిపోయిన ప్యాంట్ వేసుకున్న‌ట్టుంది. అయినా ఇప్పుడ‌ది ట్రెండ్ క‌దా అని మ‌రో యూజ‌ర్ వ్యాఖ్యానించాడు.