బీజేపీ ఓడిపోతుంది..రేవంత్ రెడ్డి జోస్యం

184
BJP will lose..Rewanth Reddy prophecy

దేశంలో ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంద‌ని రేవంత్ జోస్యం చెప్పారు.

ఢిల్లీలోని ఐదు మునిసిపల్‌ కార్పొరేషన్‌ వార్డులకు ఫిబ్రవరి 28న జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాలుగింటిని గెలుచుకుంద‌ని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజ‌యం సాధించింద‌ని వ‌చ్చిన ఓ వార్త‌ను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

ఢిల్లీ నుంచి మొదలైన బీజేపీ పతనం గల్లీ దాకా కొనసాగడం ఖాయమని అన్నారు.

నేడు ఢిల్లీలో బీజేపీ ఓటమి రేపటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు తొలి సంకేతమని ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.