ఇండియాకా నయా బ్లాక్ బస్టర్ అంట ఓసారి లుక్కేయండి..!

720
Micromax in 1 price and specifications

రోజురోజు కి టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మొబైల నిత్యావసర వస్తువు అయిపోయింది. అరచేతిలో ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్న అప్పటినుంచి, మొబైల్ కంపెనీలు కొత్తరకమైన పిచర్స్ అందుబాటులోకి తక్కువ ధరకే అందిస్తూ పోటీ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మైక్రొమ్యాక్స్ ఒక కొత్త ఫోన్ ని తక్కువ ధరకే తీసుకొచ్చింది ఇక మైక్రోమాక్స్ తన ఇన్ 1 స్మార్ట్ ఫోన్ తాజాగా ఇండియా లో లాంచ్ చేసింది.

ఇందులో మెటాలిక్ ఫినిష్, వెనకవైపు ఎక్స్ ప్యాటర్న్ ఉంది. ఇక ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంటుంది. మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ చే వర్క్ చేస్తోంది.

ఇందులో డబుల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇన్ 1 ఫేస్ అన్‌లాక్‌ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ మైక్రోమాక్స్ ఇన్ 1(ఫస్ట్ ఇంప్రెషన్స్) మార్చి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ షాపింగ్ అప్ ఫ్లిప్‌కార్ట్, మరియు మైక్రోమాక్స్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి రానుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్లు చుసుకున్నట్లైతే

  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌
  • 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లు
  • 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు
  • మైక్రో ఎస్‌డీ కార్డుతో 256జీబీ వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది.
  • 48 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
  • బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్
  • 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఇక ఈ ఫోన్ ధర చూస్తే

  • 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ.9,999
  • 6జీబీ + 128జీబీ వేరియంట్‌కు రూ.11,499 ఉంది.

ఈ ఫోన్ కోనాలి అనుకున్నా వాల్లు మాత్రం ఇంకో 6 రోజులు ఆగాల్సిందే. ఇవి మరి మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ యొక్క కబుర్లు.