త‌క్కువ ధ‌రకే 5జి స్మార్ట్‌ఫోన్‌

332

ప్ర‌పంచ సెల్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ పెరుగుతోంది. ఒక‌రికి మించి మ‌రొక‌రు స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నారు.

పోటీ ఉండ‌టం వ‌ల్ల త‌క్కువ ధ‌ర‌కే సెల్‌ఫోన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. రియల్‌మీ ఇటీవల తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ నార్జో 30 ప్రో మోడల్‌ని పరిచయం చేసింది. ఇండియాలో తక్కువ ధరలో లభించే 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే.

రియల్‌మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999. అయితే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999.

మార్చి 4న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొద‌లైంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ చూస్తే 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

రియల్‌మీ నార్జో 30 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

రియల్‌మీ నార్జో 30 ప్రో రియర్ కెమెరా 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.

రియల్‌మీ నార్జో 30 ప్రో కెమెరాలో అల్‌ట్రా 48ఎంపీ మోడ్ సూపర్ నైట్‌స్కేప్ మోడ్ నైట్ ఫిల్టర్స్ క్రోమా బూస్ట్ పనోరమిక్ వ్యూ ఎక్స్‌పర్ట్ టైమ్‌ల్యాప్స్ హెచ్‌డీఆర్ అల్‌ట్రా వైడ్ అల్‌ట్రా మ్యాక్రో ఏఐ సీన్ రికగ్నిషన్ ఏఐ బ్యూటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రియల్‌మీ నార్జో 30 ప్రో బ్యాటరీ 5,000 ఎంఏహెచ్. 30వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

రియల్‌మీ నార్జో 30 ప్రో డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. స్వార్డ్ బ్లాక్ బ్లేడ్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు.

రియల్‌మీ తక్కువ ధరకే లాంఛ్ చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ నార్జో 30 ప్రో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీ ఇస్తోంది.

ఎంఐ 10ఐ మోటో జీ 5జీ లాంటి మోడల్స్‌కు పోటీగా నిలిచింది.