వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ

248

ప్ర‌స్తుతం దేశంలో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఏది కొనాల‌న్నా, ఏది తినాల‌న్న ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఇటువంటి ప‌రిస్థితిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ శుభ‌వార్త చెప్పింది. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) హోమ్ లోన్ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.75 శాతానికి దిగొచ్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 4 నుంచే అమల్లోకి వస్తాయి.

తగ్గిన వడ్డీ రేట్లు కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి మాత్రమే కాదు, ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి కూడా వర్తిస్తుంది.

అంటే ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ హోమ్‌లోన్ కస్టమర్లు తమ వడ్డీ రేటు తగ్గించుకోవచ్చు. గత వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-(SBI) కూడా హోమ్‌లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

ఎస్‌బీఐ ఏకంగా 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో హోమ్‌లోన్ వడ్డీ రేటు 6.70 శాతానికి దిగొచ్చింది.

హోమ్‌లోన్ వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది.

ఈ ఆఫర్‌ 2021 మార్చి 31 వరకేనని ఎస్‌బీఐ ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ పాత వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి. మరోవైపు కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా హోమ్‌లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది.

కొటక్ బ్యాంక్ 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో గృహ రుణాలపై వడ్డీ 6.65 శాతానికి దిగొచ్చింది.

కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే హోమ్‌లోన్ తీసుకోవాలంటే 2021 మార్చి 31 వరకే అవకాశం ఉంటుంది.

కొత్తగా హోమ్‌లోన్ తీసుకునేవారితో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు కూడా ఇది వర్తిస్తుంది.