యాపిల్ ఐఫోన్ తక్కువ ధరకే వస్తుందంటే ఎవరైనా కాదంటారా? ఎగిరి గంతేస్తారు. ఆ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.
ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజం యాపిల్ బ్రాండ్ ఐఫోన్ ధరలు తగ్గనున్నాయి.
అందులోనూ భారత మార్కెట్లో అతి త్వరలో ఐఫోన్ ధరలు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే యాపిల్ కంపెనీ భారత మార్కెట్లో ఐపోన్ 12 మ్యానిఫ్యాక్చరింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.
భారతదేశంలో ఐఫోన్ 12 మ్యానిఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని 7 శాతం నుంచి 10 శాతం వరకు పెంచడమే లక్ష్యంగా అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే యాపిల్ తమ ఐఫోన్‌కు సంబంధించి పలు మోడళ్లలో ఐఫోన్ SE, ఐఫోన్ XR, ఐఫోన్ 11 సహా ఇతర మోడళ్లపై మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తోంది.
ఫ్యాక్స్ కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి భాగస్వామ్య కంపెనీలతో కలిసి యాపిల్ ఈ మోడళ్లను తయారుచేస్తోంది.
అందుతున్న రిపోర్టు ప్రకారం ఐఫోన్ 12 మోడల్ కోసం కూడా ఆ కంపెనీలు స్థానికంగా మ్యానిఫ్యాక్చరింగ్ చేయాలని భావిస్తున్నాయి.
దీంతో ఐఫోన్ 12 ఫ్లాగ్ షిప్ ఫోన్ల ధరలు చౌకగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రిటైల్ ఐఫోన్ల ధర మార్కెట్లో రూ.69,990గా ఉంది.
భారత ప్రభుత్వ పీఎల్ఐ స్కీమ్ కింద క్యుపర్టినో ఆధారిత టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్ మొదలుపెట్టనుంది.
మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 12 మోడల్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో లభ్యం కానుంది.
భారీగా దిగుమతి పన్నులను తగ్గించుకోవడం ఐఫోన్ల తయారీకి తోడ్పతుందని కంపెనీ భావిస్తోంది.
మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 12 మోడల్ 2021 మధ్య ఏడాదిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐఫోన్ 12 మినీ మోడల్ స్థానికంగా మ్యానిఫ్యాక్చర్ చేయనున్నట్టు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి.
దీనిపై యాపిల్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.