- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టిన పట్టభద్రులు
- పట్టభద్రులంతా సీఎం కేసీఆర్ వైపే
- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
సిఎం కెసిఆర్ గారి పట్ల పట్టభద్రులందరికీ పూర్తి విశ్వాసం ఉందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవటమే ఇందుకు నిదర్శనమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం హాలియా పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప మరియు కోరుకంటి చందర్ అంబేద్కర్ , తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు మాట్లాడుతూ…
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు , ఉపాధ్యాయులు అంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారనీ, జాతీయ పార్టీ లను పట్టభద్రులు విశ్వసించలెదన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం సిఎం కెసిఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు నిలిచిన పట్టభద్రులందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, రామగుండం కార్పొరేటర్స్ పెంట రాజేష్, అడ్డాల గట్టయ్య, టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.