బీజేపీ, టీఆర్ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలి: సీఎల్పీ నేత భట్టి

207
Youth mindset should tell BJP TRS

తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్క సారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.

ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శలు గుప్పించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగలేనని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆస్తులు సృష్టిస్తే.. బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే కొలువుల కోసమేనని భట్టి వ్యాఖ్యానించారు.

లక్ష 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి విధి విధానాలు కూడా రూపొందించలేదన్నారు.