వేపాకు టీతో  మానసిక ఒత్తిడికి చెక్!

415
Neemneem TEA reduces stress!

ప్రతి ఇంటి పరిసరాల్లో వేప చెట్లు ఉంటుంది. వేసవిలో వేప చెట్టు గాలి మన శరీరానికి చాల మంచిది. అలాగే వేపచెట్టు ఉండటం వలన క్రిమి కీటకాదులు ఇంట్లోకి ప్రవేశించలేవు.

వేప చెట్టును అనేక ఆయుర్వేదిక మందులలో ఉపయోగిస్తారు. వేపాకులతో చేసిన టీ వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి. వేపాకు టీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

మీకు ఎప్పుడైనా ఒత్తిడిగా ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకున్నా ఒక కప్పు వేప టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను వేపాకు టీ నిర్మూలిస్తుంది.

రెండు కప్పుల నీటిలో 6-10 వేపాకులు వేసి మరిగించాలి. అందులో బెల్లం లేదా చక్కెర వేస్తే చేదుగా అనిపించదు.

మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నీళ్ళు లైట్ గ్రీన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత వేడిగా ఉన్న వేపాకు టీని సేవించాలి.

వేపాకులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో వేపాకు టీ చక్కగా పనిచేస్తుంది.బ్యాక్టీరియా, వైరస్ పై వేపాకు చక్కగా పోరాడుతుంది.

మీకు చుండ్రు సమస్య ఉంటే.. నీటిలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించాలి.

దాన్ని చల్లారనివ్వాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత ఈ వేపాకు నీటితో మరోసారి శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కూడా వేపాకు టీ తాగకూడదు. అవయవ మార్పిడి చేసుకున్నవారు కూడా వేపాకు టీ సేవించరాదు.