బీజేపీ రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోంది: సత్యవతి రాథోడ్

225
Telangana Minister tests Corona positive

బీజేపీ రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోందని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీలేదని ఆమె దూయాబట్టారు.

మహబూబాబాద్ జిల్లా అంగన్‌వాడీల ఆత్మీయ సమావేశాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ నేతల పాపం పెరిగినట్లు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నాయని విమర్శించారు.

బీజేపీ వల్ల అంబానీలకు, ఆదానీలకు తప్ప సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

అంగన్‌వాడీ సమస్యలపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అంగన్‌వాడీలకు వేతనాలు పెరిగి గౌరవం లభించిందన్నారు.

త్వరలోనే అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

అంగన్వాడీలు టీఆర్ఎస్ నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.