
పంచాయితీ రాజ్ శాఖకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు.
ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
నిర్మల్ రూరల్ మండలం అనంతపేట గ్రామ శివారులో శ్రీనివాస్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్ల అమ్మకానికి వెంచర్ వేశాడు.
ఇందుకోసం అనుమతులు ఇవ్వడానికి ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ రోజు మధ్యాహ్నం నిర్మల్ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో
వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి నుంచి రూ. 2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు.