బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరికొందరికి బెయిల్

239
Boinapalli kidnap case gets bail

హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరికొంత మంది నిందితులకు ఊరట లభించింది.

ఈ కేసులో కేసులో ఏపీ మాజీమంత్రి అఖిలప్రియ నిందితురాలు అన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కేసులో మరికొందరు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత రెడ్డి, మరో నలుగురికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడుతో పాటు సిధార్థ, మల్లికార్జునరెడ్డికి కూడా బెయిల్ మంజూరు అయింది.

ఇక ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో వీరంతా కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.