దేత్తడి హారికకు షాక్‌

249

బిగ్‌బాస్ సీజన్‌-4ను చూసిన వాళ్ల‌కు దేత్త‌డి హారిక పేరు గుర్తుండేవుంటుంది.

ఈ షోలో ఆమె ప్ర‌తి టాస్క్‌ను చేసి కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే దేత్త‌డి హారిక‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓ షాక్చింది.

సోమ‌వారం (8-3-2021) అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా దేత్త‌డి హారిక‌ను తెలంగాణ టూరిజ‌మ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించారు.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త జారీ చేశారు.

అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం హారికకు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు కూడా ప్రకటించారు.

అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు తెలియ‌కుండా నియామకం జరిగినట్లు స‌మాచారం.

ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది.

దీంతో వెంటనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హారిక‌ నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు.

కానీ తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో అవి అలాగే ఉన్నాయి. యూట్యూబ్‌లో తన ప్రోగ్రామ్స్ ద్వారా హారిక మంచి గుర్తింపు పొందింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే హారిక బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యింది.

ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టంట్స్‌లో ఒకరుగా నిలిచింది. స్ట్రాంగ్ వుమెన్‌గా సత్తా చాటింది. సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారికకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

కాగా హారికకు యూట్యూబ్‌లో 1.60 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆమె యాస, భాష పక్కా తెలంగాణ స్టైల్లో ఉంటాయి.

ఇదిలావుంటే హారికకు కంటే ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియామకం అయిన విషయం తెలిసిందే.

ఆమె స్థానంలో ప్రస్తుతం తాజాగా హారికను నియమించారు. కానీ ఒక్క రోజులోనే ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది.