ఏసీలు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

435
ACs are overused .. such problems!

వేసవి కాలం ప్రారంభం కావడంతో భానుడి ప్రతాపానికి రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండలు మండుతున్నాయి.

అయితే భగ భగ మండే ఎండల వ‌ల్ల వేడిని భరించలేక చాలా మంది చల్లటి గాలి కోసం పరుగులు పెడుతుంటారు.

చాలామంది ఏసీలు బిగించుకోవడం, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు.

ఫ్యాన్ గాలి ఉన్నా అధిక ఉష్ణోగ్రతకు అది కూడా వేడిగా ఉండటంతో ఏసీ కొనేందుకు మొగ్గుచూపుతారు.

ఈ క్ర‌మంలోనే చాలా మంది కనీసం పది పదిహేను నిమిషాలు కూడా ఏసీ లేకుండా ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

అయితే ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఏసీలు మితిమీరి వాడితే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏసీల్లో ఉండటం వల్ల ప్రయోజనాల కంటే, నష్టాలే ఎక్కువని అంటున్నారు.

ఏసీలు ద్వారా వ‌చ్చే చల్లదనం సహజసిద్ధమైనది కాకపోవడంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఏసీ వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ తక్కువై బాడీ త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుందని చాలా మందికి తెలియ‌దు.

అలాగే ఏసీలో ఎక్కువగా ఉండేవారు అధికంగా నీళ్లు తాగకపోతే వాళ్లకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఎక్కువ సమయం ఏసీల్లో గడపటం వల్ల సహజమైన గాలి అందక.. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి అవకాశం ఉంటుంది. ఫ్లూ, కామన్ కోల్డ్ వంటి సమస్యలు వ‌స్తాయి.

అదేవిధంగా, ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారిపోతుంది. విపరీతమైన తలనొప్పి, కళ్లు దురద రావడం వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ వాడాల్సి వచ్చినప్పటికీ వీలైనప్పుడు బయటి వాతావరణంలో గడపాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో సెంట్రల్‌ ఏసీల్లో ఎలుకలు గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి.

ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. అందుకే ఏసీలను నెలకోకసారి శుభ్రం చేసుకోవడం మంచింది.