దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అనునిత్యం సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు.
ప్రస్తుతం ఇండియాలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉందని తెలిపారు.కేస్ పాజిటివిటీ రేటు 5.11 శాతానికి పడిపోవడమే దీనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు రోజులో 10 లక్షల నమూనాలను పరీక్షించమన్నారు.
అందులో ఐదు శాతం లేదా అంతకన్నా దిగువన పాజిటివిటీ రేటు ఉంటే, వైరస్ నియంత్రణలోనే ఉన్నట్టని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసుల్లో 2 శాతం కన్నా లోపే ఉందన్నారు.
దేశవ్యాప్తంగా 97 శాతం మంది రికవరీ అయ్యారని తెలిపారు. తమిళనాడు, పంజాబ్, హర్యానా వంటి కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపామని తెలిపారు.
దేశంలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం మహారాష్ట్ర, కేరళలోనే నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు.