బీటెక్ విద్యార్థులకు ఆర్మీలో ఉద్యోగాలు

334

నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌. ఉన్న‌త‌మైన చ‌దువులు చ‌దివి ఉద్యోగం లేక నిరుత్సాహంతో ఉన్న యువ‌కుల‌కు ఇండియ‌న్ ఆర్మీ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఇండియన్ ఆర్మీ 133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-133) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది.

బీటెక్ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి.

పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 26 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఈ వెబ్‌సైట్‌లోనే అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

ఎంపికైనవారు శిక్షణ కోసం డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాలి. ప్రభుత్వ ఖర్చులతో 49 వారాల శిక్షణ లభిస్తుంది.

ఖాళీల వివ‌రాల‌ను ఓసారి గ‌మనిస్తే…

మొత్తం ఖాళీలు- 40

సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 11
ఆర్కిటెక్చర్- 1
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 4
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 9
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 3
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 2
టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 1
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 1
శాటిలైట్ కమ్యూనికేషన్- 1
ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్- 3
ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 1
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్- 1