
అమెరికాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిఫోర్నియాలోని ఓ పారిశ్రామికవాడలో ఉన్న చెక్క పెట్టెల కర్మాగారంలో ఒక్కసారైగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో 10 బస్సులతో పాటు ఫ్యాక్టరీ పూర్తిగా కాలిపోయాయి. 10 బస్సుల్లో కొన్ని పాఠశాల బస్సులు కూడా ఉన్నాయి.
సమీపంలో పలు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొన్నారు.
సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పుతున్న క్రమంలో ఓ ఫైర్ ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనలో సమీపంలో ఇండ్లకు కానీ, అపార్ట్‌మెంట్స్‌కు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.