అమెరికా సంచలన నిర్ణయం..సౌదీ పౌరులకు వీసా నిషేధం

240
America sensational decision visa bans Saudis

జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్యపైఅమెరికా సంచలన నిర్ణయం తీసుకొంది. సౌదీ అరేబియాపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేధించింది.

జర్నలిస్ట్ ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని అమెరికా ఆరోపించింది. ఆయనపై కఠిన చర్యలేవీ తీసుకోకుండా ఆంక్షలతో సరిపెట్టింది.

మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయూతనిచ్చారని అన్నారు. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు మండిపడ్డారు.

రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలోనే అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు.

సౌదీ నిఘా విభాగం అధిపతి అహ్మద్ అల్ అసిరి, సౌదీ రాయల్ గార్డ్స్ ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ ఫోర్స్ (ఆర్ఐఎఫ్)పై అమెరికా ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది.

అసిరికిగానీ, ఆర్ఐఎఫ్ లోని సభ్యులకు గానీ అమెరికాలో ఆస్తులుంటే, వాటి క్రయవిక్రయాలపై నిషేధం విధించింది. 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది.