మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీలానే… రమ్యకృష్ణ కామెంట్స్

224
Ramya Krishnan- Vijay Deverakonda Pic Goes Viral On Social Media

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘లైగర్’.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ సహా పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఈ మూవీని సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బాక్సింగ్‌లో‌ శిక్షణ కూడా తీసుకున్నారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఇటీవలే ముంబైలో మరో షెడ్యూల్ ఫినిష్ చేశారు.

అయితే ఈ మూవీ సెట్స్‌పై విజయ్‌తో దిగిన పిక్‌ని తన ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేసిన రమ్యకృష్ణ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీలానే ఉంటుందని ఆమె పేర్కొంది.

దీంతో ఈ వీరిద్దరి ఫొటో, రమ్యకృష్ణ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.